calender_icon.png 1 July, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔటర్ పై వరుసగా 9 కార్లు ఢీ

01-07-2025 03:01:11 AM

 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ 

రాజేంద్రనగర్, జూన్ 30: ఔటర్ రింగ్ రోడ్డుపై వరుసగా 9 కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి ఆర్‌జిఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నమ్మ హోటల్ సమీపంలో జరిగింది. ఓ కారు మితిమీరిన వేగంతో వచ్చి అదుపుతప్పి ముందు వెళ్తున్న మరో కారును ఢీకొంది.

ఇలా మొత్తం తొమ్మిది కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. స్వల్ప గాయాలతో కార్లలోని ప్రయాణికులు బయటపడ్డారు. అయితే కార్లు వరుసగా ఢీకొనంతో 2 కి.మీ.ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహన దారులు ఇబ్బందులు పడ్డారు. ఓఆర్‌ఆర్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు కలిసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.