31-07-2024 11:43:55 AM
కేరళ: వయనాడ్ వరదల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 163 మృతదేహాలను వెలికితీశారు. 200 మందికి పైగా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో పలు కుటుంబాలు చిక్కుకున్నాయి. వయనాడ్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం డ్రోన్లతో గాలిస్తున్నారు. ముంక్కైలో సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 83 మృతదేహాలను గుర్తించారు. 143 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. మంగళవారం 32 మృతదేహాలను బాధిత కుటుంబాలకు అధికారులు అందజేశారు. అటు పార్లమెంట్లో ప్రత్యేకంగా సమావేశమైన కాంగ్రెస్ ఎంపీలు వయనాడ్ మృతుల కుటుంబాాలకు సంతాపం తెలిపారు.