31 July, 2026 | 8:55 AM

మృత్యు శిఖరంలా మారుతున్న ఎవరెస్టు

26-05-2024 02:17 AM

ఏటా పెరుగుతున్న మరణాల సంఖ్య

2024లో ఏడుగురు మృతి

నేపాల్, మే 25 : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం ఎంతో సాహసంతో కూడుకున్న పని. ఏటా వందల మంది ప్రయత్నిస్తే అతికొద్ది మంది మాత్రమే పైవరకు చేరుకుంటారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా కొందరు పర్వతారోహులు మధ్యలోనే ప్రాణాలు వదులుతున్నారు. దీంతో, ఎవరెస్టు మృత్యు శిఖరంగా మారింది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే ఏడుగురు మరణించారంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రతికూల వాతావరణం, ఏటవాలు శిఖరాలతో పాటు ఎవరెస్టుపై ఎక్కేవారి సంఖ్య పెరుగుతున్నందున ఏటా మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆక్సిజన్ అంద క కొందరు అనారోగ్యంతో మరణిస్తుంటే, మరికొందరు తప్పిపోతున్నారు. మే 21న తెల్లవారుజామున 4.40 గంటలకు మంచు కూలిపోలిపోయినప్పుడు పలువురు మిస్స య్యారు. ఎవరెస్టు శిఖరంపై డెత్‌జోన్‌గా పరిగణించే ప్రాంతంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో ఎవరెస్టుపై చెత్తా, చెదారం కూడా పెరుగుతోంది.