పీర్జాదిగూడలో దశాబ్ది ఉత్సావాలు
02-06-2024 12:05 AM
మేడిపల్లి, జూన్ 1 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ పార్టీ నగర ప్రధానకార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పీర్జాదిగూడలో తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్య మం ప్రజలను ఏకం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేలా చేసిందన్నారు.
ఉద్యమంలో అన్ని వర్గాల వారు పాల్గొని ప్రాణాలర్పించాలని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మధుసూదన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు ఏనుగు మనోరంజన్‌రెడ్డి, నిర్మల, జిలానీ పాష, ప్రభాకర్‌రెడ్డి, జావీద్‌ఖాన్, ఆంజనేయులు, బాలరాజు, వెంకన్న, శ్రీనివాస్, కిరణ్, జగన్‌రెడ్డి, శంకర్‌రావు పాల్గొన్నారు.






