రాజీ మార్గమే రాజమార్గం
సిద్దిపేట రూరల్, జూన్ 1 (విజయక్రాంతి): ఈ నెల 8న సిద్దిపేటలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని, రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామదేవి కోరారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ గురించి జిల్లా ఇన్సూరెన్సు కంపెనీ మేనేజర్స్, చిట్‌ఫండ్ కంపెనీస్‌తో సిద్దిపేట న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్ సాయిరమాదేవి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఎంవిఓపి, ఈపి, చిట్‌ఫండ్, ఫైనాన్స్ కేసులతో పాటు పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసు లు రాజీ చేయాగలరని న్యాయవాదులకు సూచించారు. పోలీస్ సిబ్బంది, పబ్లిక్ ప్రాసి క్యూటర్‌తో రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించేలా చూడాలన్నారు. 2 నుంచి 3వేల కేసుల వరకు రాజీకి అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలోప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్. స్వాతిరెడ్డి, అడిషనల్ సినియర్ సివిల్ జడ్జి మిలింద్ కాంట్లే, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి పి చంద న, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రావని యాదవ్, సిద్దిపేట బార్ అసోసియేషన్ చైర్మన్ ఎస్.జనార్దన్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటలింగం, సిద్దిపేట ఎసీపీ మధు, సీఐ, ఎస్సై, కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.






