calender_icon.png 19 October, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీట్ల సంఖ్య తేల్చండి

17-10-2025 12:25:48 AM

-ఆర్జేడీ చీఫ్‌కు రాహుల్ ఫోన్

-61 స్థానాలకు కాంగ్రెస్ అంగీకారం!

న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇచ్చే సీట్ల సంఖ్యను తేల్చాలని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు గురువారం మిత్రపక్షమైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఆయన ఫోన్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య సీట్ల కేటాయింపు విషయంలో ఇప్పటివరకు ఏకాభిప్రాయం కుదరలేదు. తొలుత ఆర్జేడీ కాంగ్రెస్‌కు 52 సీట్లు ఇచ్చిం ది. కానీ కాంగ్రెస్ తిరస్కరించింది. కనీసం 61 స్థానాలు కావాలని పట్టుపట్టింది.

అయితే ఆర్జేడీ నేతలు కాంగ్రెస్ 61 సీట్ల డిమాండ్‌కు ఒప్పుకోవడానికి ముందుకు వచ్చినప్పటికీ కొన్ని కీలక నియోజకవర్గాల విషయంలో విభేదాలు మొదలయ్యాయి. దీంతో రాష్ట్రస్థాయి కాంగ్రెస్ నేతలు, ఆర్జేడీ మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లాలూప్రసాద్‌తో ఫోన్లో చర్చించారని పార్టీ వర్గాలు తెలిపాయి. 61 సీట్లతో కాంగ్రెస్ సరిపెట్టుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం.