calender_icon.png 19 October, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త చట్టం తెస్తాం

19-10-2025 01:05:13 AM

కన్న వారిని కాదంటే ఉద్యోగుల జీతం కట్!

  1. గత పాలకులు కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు
  2. అల్లుడిని అంబానీగా, కుమారుడిని బిర్లాగా చేయాలకున్నారు 
  3. త్వరలో గ్రూప్-3, 4 నియామక ప్రక్రియ పూర్తిచేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
  4. గ్రూప్-2 విజేతలకు నియామక పత్రాలు పంపిణీ 

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన గత పాలకులు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చే యలేదని, వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారే తప్ప గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. పదిహేనేళ్లుగా గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ జరగ లేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? అని అన్నారు.

అల్లుడిని అం బానీగా, బిడ్డను బిర్లాగా చేయడం కోసమే పదేళ్ల పాలన సరిపోయిందని ఆయన విమర్శించారు. గతంలో ఎన్నడూ జరగని కులగణన, కాంగ్రెస్ పోరాటం వల్లే త్వరలో దేశవ్యాప్తంగా సాధ్యం కానుందని, కేంద్రం చేపట్టే జనగణనలో కులగణన చేర్చడం అనివార్యమైందన్నారు.  తమ ప్రభుత్వం కులగణనను చేసి దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. 

శనివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రూప్-2 విజేతలకు ఉద్యోగ నియామక పత్రా లు అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఉద్యోగాలు పొందిన వారు ఎవరైనా తల్లిదండ్రులను పట్టించుకోకపోతే... వారి జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తానని, అందుకు కొత్త చట్టం తీసుకొస్తా అని రేవంత్‌రెడ్డి తెలిపారు. నిస్సహాయులకు సహాయం అందించడం ఉద్యోగులు గా మీ బాధ్యతని అభ్యర్థులకు సూచించారు. 

అంతా నిర్లక్ష్యమే..

శ్రీకాంతచారి, వేణుగోపాల్ రెడ్డి, కిష్టయ్య, యాదయ్య లాంటి విద్యార్థుల ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ర్టం సాకారమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీల్లో ఉంటూ వేలాది మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, కానీ నాటి రాజకీయ పార్టీల నాయకులు నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదాన్ని, తెలంగా ణ ప్రజల ఆకాంక్షలను ఆయుధంగా మార్చుకొని పదేళ్లు అధికారాన్ని చెలాయించారని విమర్శించా రు.

నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదని, పరీక్షలను సక్రమంగా నిర్వహించలేకపోయిందన్నారు. ప్రశ్నపత్రాలు జీరాక్స్ షాపుల్లో పల్లీ బఠాన్నీల్లెక్క అమ్ముకున్నారని చెప్పారు. నిధుల విషయానికొస్తే వాళ్ల కుటుంబ సభ్యులు, బంధు వర్గాన్ని ఆగర్భ శ్రీమంతులు చేయటం కోసమే పదేళ్లు పరిపాలన సాగిందని, ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. తన ఫామ్‌హౌజ్‌లో ఎకరా పంటపై రూ.కోటి ఆదా యం వస్తుందని ఒక పెద్దాయన చెప్పారని కేసీఆర్ ను ఉద్దేశించి విమర్శించారు.

ఎకరాపై రూ.కోటి వచ్చే విద్యను రైతులు, యువత, ప్రజలకు ఎందుకు నేర్పలేదని ప్రశ్నించారు. ప్రజల గురించి ఆలోచించి ఉంటే కాళేశ్వరం..కూలేశ్వరం అయ్యి ఉండేది కాదన్నారు. రూ.లక్ష కోట్లతో కట్టిన ఒక ప్రాజెక్టు మూడేళ్లకే కూలిన ఘటన ఎక్కడా జరగలేదని విమర్శించారు. 

త్వరలో గ్రూప్-3, 4 నియామకపత్రాలిస్తాం

అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల క్రితమే మీకు ఉద్యోగాలు వచ్చేవని సీఎం చెప్పారు. ముందే గ్రూప్-2 ఉద్యోగాలిస్తే గ్రూప్-1లో అవకాశాలు కోల్పోతారనే ఇవ్వలేదన్నారు. త్వరలో గ్రూప్-3, గ్రూప్-4 నియామకపత్రాలు అందజేస్తామన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తిచేసి, వాటి ఇళ్లల్లో దసరా పండుగను ముందే తెచ్చామన్నారు. మిమ్మల్ని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత అందరిపై ఉందన్నారు. 

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, తర్వాత మరో 11 వేల ఉద్యోగాల కల్పించామ న్నారు. గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి, అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో తమపై బురద జల్లే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ఏ వ్యవస్థ తమకు లేదని.. మా వ్యవస్థనే మీరు.. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులన్నారు. 

అధికారంలో నేనుంటనో..ఉండనో..

‘ఇప్పటివరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్. మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా పనిచేయాలి. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిల పాలి. అంతవరకూ నేను అధికారంలో ఉంటనో ఉండనో కానీ, మీరు అధికారులుగా ఉంటరు. తెలంగాణ గాజు లాంటిది. దీన్ని కిందపడనీయొద్దు. జాగ్రత్తగా చూసుకోవాలి. సెంటిమెంట్‌తో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగ ఉండాలి. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. 

పుట్టిన ఊరిని, తల్లిదం డ్రులను ఎన్నటికీ మరవద్దు. లేకుంటే కొత్త చట్టం తీసుకొచ్చి మీ జీతం నుంచి మీ తల్లిదండ్రుల ఖాతాల్లో 10-15 శాతం జీతం వేయిస్తా. నిస్సహాయులకు సహాయం చేయండి.. మీతోనే ఒక కమిటీ వేసి, చట్టం రూపొందిస్తా. పేదలకు అండగా నిలవండి. గురుకులాలు, హాస్టల్స్‌లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి చనిపోతేనో, టన్నెల్‌లో ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారని గత పాలకులను ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణను కాపాడండి. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్‌తో ఎవరూ ప్రాణా లు కోల్పోకుండా చూడాలి. సమర్ధవంతంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలి’ అని సీఎం అభ్యర్థులకు సూచించారు. 

కోట్లు ఇచ్చి ఉద్యోగం కొనగలరా?

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక టీజీపీఎస్సీని భర్తీచేసి పోటీ పరీక్షలు విజయవం తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కానీ కొందరు వాటిని అడ్డుకునేందుక కుట్రలు చేస్తేన్నారని మండిపడ్డారు. రూ.3 కోట్లు తీసుకొని గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చారని గత పాల కులు తమపై ఆరోపణలు చేస్తున్నారని, పేదిం టి బిడ్డలు రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగం కొనగలరా? అని ప్రశ్నించారు. కష్టపడి చదివిం చిన తల్లిదండ్రులను ఇది అవమానించడమే కదా! అన్నారు. రాజకీయ చౌకబారు విమర్శ లు ఎదుర్కొన్నప్పుడు తనకు ఆవేదన కలిగిందని అన్నారు. గత పాలకుల పాపాల పుట్ట పగులుతోందని, వారు చేసిన అవినీతి, దోపి డీ గురించి వాళ్ల కుటుంబ సభ్యులే బయటపెడుతున్నారని చెప్పారు.

త్రిలింగదేశం కథ..

సీఎం రేవంత్ రెడ్డి...కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఓ త్రిలింగదేశం కథ చెప్పారు. ‘త్రిలింగదేశంలో రాజు చంద్రసేనుడు.. ఆయన కొడుకు రామసేనుడు, అల్లుడు హరిసేనుడు ఉండేవారు. అయితే ఆ రాజ్యం కోసం బావబామ్మర్దులు ఇద్దరూ దేవుని కోసం కఠోర తపస్సు చేశారు. వరంగా హరిసేనుడు ఒక కన్ను తిసేయమంటే ... రామసేనుడు రెండు కళ్లు తిసేయమన్నాడు. ఆ తరువాత వారికి అడుక్కోవడమే మిగిలింది’.

అనంతరం గ్రూప్ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియామకపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో  మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

రాష్ర్టంలో ఎవరు ఖాళీగా ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి

అయితే బడికి వెళ్లాలి.. లేదంటే ఉద్యోగం చేయాలి తప్ప రాష్ర్టంలో ఏ ఒక్కరు ఖాళీగా ఉండొద్దని ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగమంటే పని.. వేతనమే కాదని, ఇవి కేవలం నియామకపత్రాలే కాదని, తల్లుల కన్నీళ్లు తుడిచే పత్రాలని సూ చించారు. రాష్ర్టంలోని ప్రతి బిడ్డ బడికి రావా లి, వచ్చిన ప్రతిబిడ్డ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, నైపుణ్యాలు పొందాలి.. ప్రతి బిడ్డ ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం పొందాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యంమన్నారు.

మారు తున్న కాలానికి అనుగుణంగా కార్పొరేట్ వ్యవస్థలో ఉద్యోగాలు పొందేందుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి పాఠశాలను 25 ఎకరాల్లో 200 కోట్ల రూపా యలు ఖర్చు చేసి నిర్మిస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ పనులు శర వేగంగా జరుగుతున్నాయని, రాష్ర్టంలోని ఐటిఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు.

ఒకే రోజు 783 మందికి గ్రూప్ -2 నియామక పత్రాలు అందించడం చరిత్రలో సువర్ణాక్షలతో లిఖించదగిన రోజు ఇది అన్నారు. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారు రాష్ర్టం ఏమైపోయినా పర్వాలేదు వారి కుటుంబం మాత్రం బాగుపడితే చాలు అని రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోపిడీ చేశారని విమర్శించారు.

2047 వరకు తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వృద్ధి చెందాలని ప్రపంచంతో పోటీ పడాలని, రూపాయి, రూపాయి పోగేసి రైజింగ్ తెలంగాణ నినాదంతో ముందుకు పోతున్నామని వివరించారు. నియామక పత్రాలు పొందిన అధికారుల ద్వారా తెలంగా ణ రాష్ర్టంలోని మూడున్నర కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందాలని ఆశిస్తున్న ట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. ఉద్యోగ నియామకపత్రాలు అందుకున్న అభ్యర్థులతో సీఎస్ ప్రతిజ్ఞ చేయించారు.