17-10-2025 12:23:27 AM
-రెండు రోజుల్లో 258 మంది అజ్ఞాతం వీడటం సంతోషకరం
-మిగిలినవారు లొంగిపోతే స్వాగతిస్తాం.. లేదంటే తుపాకీతో సమాధానం
-వచ్చే మార్చి 31నాటికి మావోయిస్టులను సమూలంగా నిర్మూలిస్తాం
-ఇక అబూజ్‌మడ్.. ఉత్తర బస్తర్‌లు మావోయిస్ట్ రహిత ప్రాంతాలు
-‘ఎక్స్’వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : మొ న్న మహారాష్ట్ర.. నిన్న ఛత్తీస్‌గఢ్ రాఫ్ట్రాల్లో రెండు రోజుల వ్యవధిలోనే 258 మంది మావోయి స్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవడం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద విజయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంతో షం వ్యక్తం చేశారు. తీవ్రవాద అంతానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ప్రస్తుత ఫలితాలు ప్రతిబింబాలని ఆయన అభివర్ణిం చారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఆయుధాలు వీడి ఉద్యమ సహచరులతో కలిసి జనజీవన స్రవంతిలో కలుస్తుండడంపై ‘ఎక్స్’ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు.
ఇంకా తీవ్రవాద మా ర్గంలో కొనసాగుతున్న వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. మా ప్రభుత్వ విధానాలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొంటూ.. లొంగిపోయే మా వోయిస్టులను స్వాగతిస్తామని.. ఉద్యమబాటలోనే పయనిస్తామనుకునే వారు భద్రతా దళాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. 2026వ సంవత్సరం మా ర్చి 31 నాటికి మావోయిస్టులను సమూలంగా నిర్మూలిస్తామని తెలిపారు. ఒకప్పు డు వామపక్ష తీవ్ర వాద స్థావరాలుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్.. ఉత్తర బస్తర్‌లను తీవ్రవాద రహిత ప్రాంతాలుగా ప్రకటించడం తనకెంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణ బస్తర్‌లో కొంత మావోయిస్టుల జాడ ఉందని, త్వరలోనే వారికి భద్రతా దళాలు సరైన రీతిలో సమాధానం చెబుతాయని పేర్కొన్నారు.