05-08-2025 12:22:02 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): బంజారాహిల్స్ రోడ్ నెంబర్-1 లో గల లేబుల్స్ పాప్ -అప్ స్పేస్‌లో కొలువుదీరిన డి సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శనను సోమవారం సెలబ్రిటీ కో, నగర సోషలైట్ డాక్టర్ సంగీత కోసూరు ప్రారంభించారు. “విభిన్నమైన పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాం డ్లూమ్, సిల్క్ వస్త్రో త్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అ న్నారు.
నేరుగా వీవర్ నుంచి వినియోగదారునికి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరు సందర్శించి, మరింత ప్రోత్సహించాలని డాక్టర్ సంగీత కోసూరు కోరారు.
డి సన్స్ పటోలా ఆర్ట్స్ నిర్వాహకులు భవిన్ మా ట్లాడుతూ.. ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో ప్రత్యేక కలెక్షన్స్ వేదికగా పటాన్ పటోలా, బంధాని, పైధాని, బనారసి, జరీ కోట, చందేరి, మహేశ్వరి, కాశ్మీరీ నేత వస్త్రాలు, లక్నోవి, కంచిపట్టు, వెంకటగిరి, డ్రెస్ మెటీరియల్ల్స్, అజ్రక్ చీరలు, కుర్తీలు, బెడ్‌షీట్లులతో పాటు ఆభరణాలు వంటి 10 వేల రకాల వస్త్రోత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నేత కార్మికులను ప్రోత్సహించడంతో పాటు చేనేత పరిశ్రమకు మార్కెట్‌ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన సామాజిక లక్ష్యం అని వివరించారు.