calender_icon.png 5 August, 2025 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

05-08-2025 12:20:56 AM

మహబూబాబాద్, ఆగస్టు 4 (విజయ క్రాంతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను మహబూబాబాద్ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి వివిధ చోరీ ఘటనలకు సంబంధించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. డి.ఎస్.పి తిరుపతిరావు కథనం ప్రకారం..

మహబూబాబాద్ పట్టణంలోని నర్సంపేట బైపాస్ రోడ్డులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా హీరో హోండా షైన్ వాహనంపై వస్తున్న వ్యక్తి ప్రవర్తన అనుమాదాస్పదంగా ఉండడంతో ఎస్‌ఐ శివ, సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం అతని విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం గ్రామానికి చెందిన గొర్రెల చిన్నబాబు అనే అతడు మహబూబాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఆరు దొంగతనాలు తనే చేసినట్టు అంగీకరించడంతోపాటు అతని వద్ద నుంచి చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు.