13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

31-03-2026 04:10 PM

బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మేడబోయిన యాదగిరి

నాగారం,(విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గ స్థాయిలో ఏప్రిల్ 4, 5వ తారీఖులలో నిర్వహించే దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు మేడబోయిన యాదగిరి పిలుపునిచ్చారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ 2026 కార్యక్రమంలో భాగంగా మంగళవారం లక్ష్మాపురం గ్రామంలో బిజెపి పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మేడబోయిన యాదగిరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఏప్రిల్ 4, 5వ తారీఖులలో తిరుమలగిరి పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యకర్తలకు 24 గంటల శిక్షణ శిబిరాల ద్వారా సిద్ధాంతపరమైన అవగాహన, సాంఘిక సవాళ్లను ఎదుర్కోవడం, పార్టీ నిర్మాణంపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ప్రతి బిజెపి పార్టీ కార్యకర్త హాజరుకావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాగారం మండల అధ్యక్షులు కుంభం కరుణాకర్,బిజెపి పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు దేశగాని నర్సయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు శాగంటి సత్తయ్య, జాటోత్ నెహ్రు, బూత్ అధ్యక్షులు శాగంటి వీరభద్రయ్య,బిజెపి పార్టీ నాయకులు జాటోత్ నరేష్, శాగంటి శ్రీను శాగంటి బిక్షం గెండెల ఉప్పలయ్య మేడబోయిన శ్రీకాంత్, భాషబోయిన యాదగిరి,నీలం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.