11 March, 2026 | 7:36 AM

వేసవికి సిద్ధమవుతున్న దీవాన

11-03-2026 01:25 AM

‘శుభం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ నటుడు హర్షిత్‌రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన’. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్‌పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా స్టోరీ పోస్టర్‌కు మంచి వచ్చింది.

ఇంటెన్స్ లవ్‌స్టోరీగా వస్తున్న ఈ చిత్రం హర్షిత్‌రెడ్డి కెరీర్‌లో మరో గుర్తుండిపోయే సినిమా కానుందని టీమ్ పేర్కొంటోంది. ఈ సినిమాను ఈ వేసవిలోనే గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయనుంది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి డీవోపీ: వంశీ పచ్చిపులుసు; సంగీతం: ఈశ్వర్ చంద్; ఎడిటర్: హృషికేశ్ పాస్పల్.