17-05-2025 12:57:24 PM
కొత్తపల్లి: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులలో రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నందున విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య యు.ఉమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలో భాగంగా కరీంనగర్ పట్టణంలోని వాణినికేతన్ డిగ్రీ కళాశాలను సందర్శించి పరీక్షలు నడుస్తున్న తీరును పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ... విద్యా సంవత్సరంలో ఎటువంటి మార్పులు లేకుండా తృతీయ సంవత్సర విద్యార్థులకు న్యాయం జరిగేందుకు పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, పరీక్షలు ముగిసిన అనంతరం మూల్యాంకనం కూడా తొందరగా చేపట్టి ఫలితాలను సకాలంలో తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలని పరీక్షల నియంత్రణ అధికారి డా.సురేష్ కుమార్ ను ఆదేశించారు.