బిట్స్ పిలానీ స్నాతకోత్సవంలో ఉద్యోగులకు డిగ్రీలు
ముషీరాబాద్,ఆగస్టు 23(విజయక్రాంతి): బిట్స్ పిలానీ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్(డబ్ల్యూ.ఐ.ఎల్.పీ) ఆధ్వర్యంలో జరిగిన 2026 స్నాతకోత్సవంలో రికార్డు స్థాయిలో 15,153 మంది ఉద్యోగులకు 30 ప్రత్యేక విభాగాల్లో డిగ్రీలు అందుకున్నట్లు బిట్స్ పిలానీ ఛాన్సలర్ డాక్టర్ కుమార్ మంగళం బిర్లా ఆదివారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ క్యాం పస్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని డిక్సన్ టెక్నాలజీస్ వైస్ చైర్మన్, ఎండీ అతుల్ బి.లాల్, బిట్స్ పిలానీ వైస్ చాన్సలర్ ప్రొ.వి.రామ్గోపాల్ రావు, ఆఫ్-క్యాంపస్ ప్రోగ్రామ్స్ అండ్ ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ ఇన్ చార్జ్ ప్రొ.ఎస్.గురు నారాయణన్ తదితరులు పాల్గొని నిర్వహించినట్లు చెప్పారు. విద్య, ఉపాధి మధ్య ఉన్న విభజన తొలగి, ఉద్యోగంతో పాటు నిరంతర విద్య కొనసాగాలని అన్నారు.






