calender_icon.png 24 May, 2025 | 1:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నివారించాలి

24-05-2025 01:13:21 AM

మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి 

పాపన్నపేట, మే 23: ధాన్యం కొలుగోలులో జరుగుతున్నజాప్యాన్ని నివారించి తక్షణం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని  నాగసానిపల్లి గ్రామం లో తడిసిన ధాన్యాన్ని ఆమె పరిశీలన చేశారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షానికి రైతుల ధాన్యం తడిసి మొలకెత్తిదన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలనీ ఆమె డిమాండ్ చేసారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు కల్పించక పోవడం వల్లనే ధాన్యం తడిసి మొలకెత్తి రైతులకు నష్టం చేకూరిందన్నారు.

ఈ సందర్బంగా ఆమె కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలనీ కోరారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలన్నారు వీరి వెంట వీరి వెంట పాపన్నపేట్ మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మెదక్ జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షులు సోములు,ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్లు బాలా గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, పాపన్నపేట్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి,నాయకులు దుర్గయ్య, రఘు, మనోహర్,మాధవ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రవి కుమార్, నర్సింలు, రైతులు తదితరులు ఉన్నారు.