18-11-2025 09:54:25 AM
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర కారు బాంబు పేలుడు(Delhi blast case) కేసులో ఉగ్రవాది ఉమర్(Terrorist Umar last video) చివరి వీడియో విడుదల చేశాడు. సూసైడ్ బాంబు మీద తన వాదనను డాక్టర్ ఉమర్ వినిపించాడు. ఆత్మాహుతి దాడిపై సమాజంపై పలు రకాల వాదనలున్నాయని తెలిపాడు. ఆత్మాహుతి చేసుకోవాలని చూసేవాడు.. చాలా భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాల్సి ఉంటుందని ఉమర్ వెల్లడించాడు. చావే అంతిమ లక్ష్యం అని నిశ్చయించుకోవాలని సూచించాడు. నిజానికి, అలాంటి ఆలోచనను ఈ సమాజం ఒప్పుకోదు, ఆత్మహుతి దాడి ప్రజాస్వామ్యం కాదు, ఏ నాగరిక సమాజం కూడా దీన్ని అంగీకరించదని వివరించాడు.
ఎందుకంటే ఇది జీవితం, సమాజం, చట్టం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నాడు. ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన పేలుడుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం, దాని ట్రస్టీలు మరియు అనుబంధ వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన పలు ప్రదేశాలలో సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ దాడుల్లో ఢిల్లీలోని ఓఖ్లాలో ఉన్న విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో సోదాలు కూడా ఉన్నాయి. ఈ కేసుతో ముడిపడి ఉన్న ఆర్థిక, కార్యాచరణ సంబంధాలను ఈడీ ప్రస్తుతం పరిశీలిస్తోంది.