15 April, 2026 | 8:02 AM

పిస్తా హౌస్, షా గౌస్, మెహిఫిల్ హోటళ్లలో ఐటీ సోదాలు

18-11-2025 09:02 AM

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆదాయపన్ను శాఖ అధికారులు(Income Tax Raids) మంగళవారం సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 15 చోట్లు ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ హోటళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో దాడులు జరుగుతున్నాయి. పిస్తా హౌస్, షా గౌస్(Shah Ghouse) హోటళ్లలో అధికారులు సొదాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు ప్రముఖ హోటళ్లు ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. హైదరాబాద్, ఇతర నగరాల్లోనూ పిస్తాహౌస్, షా గౌస్, మెహిఫిల్ హోటళ్లు నడుస్తున్నాయి.  పిస్తాహౌస్, షా గౌస్ హోటళ్లు దుబాయ్ లోనూ బ్రాంచ్ లు నిర్వహిస్తున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలతో సోదాలు చేస్తున్నట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు. రాజేంద్రనగర్ లో పిస్తా హౌస్ యజమాని మాజిద్ ఇంట్లో ఐటీ సోదాలు చేసింది. శాలిబండలోని పిస్తా హౌస్ మెయిన్ బ్రాంచ్ లో సోదాలు చేస్తోంది. పాతబస్తీ, గచ్చిబౌలి, లక్డీకాపూల్ ప్రాంతాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి.