18-11-2025 11:00:16 AM
ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డురావడంతో ప్రమాదం
యాచారం: ద్విచక్ర వాహనానికి అడ్డుగా వచ్చిన కుక్కను ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి గడ్డ మల్లయ్యగూడ, రంగాపూర్ గ్రామాల మధ్య చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చౌదర్ పల్లి గ్రామానికి చెందిన అజ్జు (45) కొన్నేళ్లుగా చీదేడులోని అత్తగారింటి వద్ద నివాసముంటూ, మంగళ్ పల్లి వద్ద ఉన్న ఆయిల్ మిల్లులో లారీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని చీదేడులోని అత్తగారింటికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మల్లయ్యగూడ దాటగానే రోడ్డుకు అడ్డంగా వీధి కుక్క రావడంతో దాన్ని ఢీకొని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. అతని మృతితో చౌదర్ పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.