calender_icon.png 18 November, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు మృతి

18-11-2025 10:41:32 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా( Alluri district) మారేడుమిల్లి అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా సిబ్బంది, మావోయిస్టులకు(Maoists) మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మారేడుమిల్లి, అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఏపీ, ఛత్తీస్ గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు మావోయిస్టుల కదలికలపై కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు తారసపడడంతో ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ భారీ ఎన్‌కౌంటర్ పై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ... ''అల్లూరిసీతారామరాజు జిల్లాలో, మారేడుమిల్లిలో పోలీసులు-మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్ ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య జరిగింది. ఈ కాల్పుల్లో, ఒక అగ్ర మావోయిస్టు నాయకుడు సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం భారీ కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోంది.'' అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. అటు ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని ఎర్రబోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుకాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎర్రబోర్ అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.