అదనపు నీరివ్వండి..
సుప్రీం కోర్టు తలుపు తట్టిన ఢిల్లీ ప్రభుత్వం
న్యూఢిల్లీ, మే 31: తీవ్రమైన ఎండలు, నీటి ఎద్దడితో ఉత్తరాది ప్రజలు ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చుక్క నీటి కోసం అరిగోస పడుతున్నారు. నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు, ప్రజలకు నీరు అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టింది. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఈ నెల రోజుల పాటు అదనంగా నీరు విడుదల చేసే లా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది.
గత కొద్ది రోజులుగా ఢిల్లీలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో నీటికి డిమాండ్ పెరగ డంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. కార్ వాషింగ్, భవన నిర్మాణ పనులకు నీటి వాడకంపై ఢిల్లీ జల బోర్డు నిషేధం విధించింది. ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.2 వేలు జరిమానా విధిస్తా మని హెచ్చరించింది. కాగా, హర్యా నా ఢిల్లీకి సరఫరా చేయాల్సిన నీటిని విడుదల చేయట్లేదని మంత్రి అతీశీ ఆరో పించారు. వాటర్ ట్యాంకర్ అవసరం ఉంటే ఢిల్లీ జల బోర్డుకు ఫోన్ చేస్తే పంపిస్తామని ఆమె భరోసా ఇచ్చారు.






