26 July, 2026 | 2:46 AM

కొనసాగుతున్న మోదీ ధ్యానం

01-06-2024 02:41 AM

కన్యాకుమారి, మే 31: ప్రధాని నరేంద్రమోదీ ధ్యానం కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగియగానే గురువారం సాయంత్రం తమిళనాడులోని కన్యాకుమారిలో ధ్యాన ముద్రలోకి జారుకున్న మోదీ తన ధ్యానాన్ని కొనసాగిస్తున్నారు. కన్యాకుమారిలోని వివేకానంద స్మారక స్థూపం వద్ద ఉన్న మండపంలో ఆయన ధ్యానం చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో మొన్నటి వరకు బిజీబిజీగా గడిపిన ప్రధాని.. ప్రశాంతత కోసం ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇవాళ ఉదయం సూర్యోదయ వేళ ‘సూర్య అర్ఘ్య’ నిర్వహించారు. కాషాయ వస్త్రాలు, కండువా కప్పుకొన్న మోదీ.. జపమాల ధరించి ధ్యానంలో కూర్చున్నారు. ఆయన ధ్యానం చేస్తున్న ఫొటోలను బీజేపీ మీడియా విభాగం విడుదల చేసింది. కాగా, ఇదే ప్రాంతంలో 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేసి, మోక్షం పొందారు. గత మూడు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తర్వాత మోదీ.. ఏదో ఒక చోట ధ్యానం చేస్తూ ఉన్నారు.

45 గంటల పాటు ధ్యాన ముద్రలో ప్రధాని మోదీ

ఇవాళ సాయంత్రానికి ముగియనున్న ధ్యానం