13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

అంబులెన్స్‌లో ప్రసవం తల్లీబిడ్డ క్షేమం

27-03-2026 02:26 AM

ములుగు, మార్చి26 (విజయక్రాంతి): గర్భిణీ స్త్రీకి ప్రసవ సమయం దగ్గర పడి పురిటినొప్పులు వచ్చి రక్త హినతతో అల్లాడుతున్నా ప్రభుత్వ వైద్యు లు ప్రసవం చేయకపోవడంతో 108 అంబులెన్స్ లో ములుగు జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురి టి నొప్పులు అధికం కావడంతో 108 అంబులెన్సులోనే తప్పనిసరి పరిస్థితిలో కాన్పు నిర్వహించారు. వాజేడు మండలం దూలాపురం గ్రామానికి చెందిన మోడెమ్ సమ్మక్క అనే గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో బాధపడుతుండగా ముందుగా ఏటూరునాగారం ఆసుపత్రిలో వైద్య పరిక్షలు చేయడంతో కేవలం 6శాతం రక్తం ఉండి, ఉమ్మనీరు తగ్గిపోవడాన్ని పరీక్షించి ము లుగు జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు.

ఏటూరునాగారం అంబులెన్స్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో గోవిందరావుపేట పరిధిలో పురిటినొప్పులు అధికం అవడాన్ని గమనించిన టెక్నీషియన్ శివలింగంప్రసాద్ ఈఆర్సిపి డాక్టర్ మౌనిక సూచన సలహాలతో రక్త హీనతతో బాధ పడుతున్న గర్భిణీ స్త్రీతో వచ్చిన ఆశా కార్యకర్త సహకారంతో గర్భిణీకి సుఖ ప్రసవం నిర్వహించారు. మగ బిడ్డను ప్రసవించిన తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అనంతరం ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లి బిడ్డను రక్షించిన అంబులెన్స్ సిబ్బందికి గర్భిణీ స్త్రీ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.