13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పారిశుధ్యం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి

27-03-2026 02:27 AM

అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో

మహబూబాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): మున్సిపాలిటీల్లో పారిశుధ్యం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని, పారిశుధ్య నిర్వహణపై నిరంతరం పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. గురువారం డోర్నకల్ మునిసిపాలిటీలో చైర్ పర్సన్ కొండేటి రాజకుమారి అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వార్డుల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.

బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచుకోవాలని, నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని సూచించారు.వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షించి, అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో డోర్నకల్ మునిసిపల్ కమిషనర్ నిరంజన్, వైస్ చైర్ పర్సన్ మాదా లావణ్య, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.