25 March, 2026 | 1:09 PM

Breaking News

సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •   తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్   •   పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. వదంతులతో జనం పరుగులు   •  

బియ్యం డెలివరీ వేగవంతం చేయాలి

17-05-2024 01:56 AM

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్

నర్సాపూర్, మే 16 : బియ్యం డెలివరీతో పాటు రబీ 2022 సీజన్‌కు సంబంధించి టెండర్ అయిన ధాన్యం అప్పగింతలు త్వరగా చేయాలని రైస్‌మిల్ యాజమానులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఉన్న వేంకటేశ్వర రైస్‌మిల్లును గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మిల్లర్లు బియ్యం డెలివరీ వేగవంతం చేసి త్వరగా వానకాలం ధాన్యం బియ్యం అప్పగించాలని తెలిపారు. టెండర్ పూర్తయిన యాసింగి రబీ 2022 ధాన్యం వెనువెంటనే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని, బియ్యం డెలివరీలో జిల్లాను ముందు వరుసలో నిలుపాలని తెలిపారు. రోజువారీ బియ్యం పంపిణీపై సమీక్ష చేసి రోజువారి నివేదికలు అందజేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, జిల్లా  మేనేజర్ హరికృష్ణ, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ సిబ్బంది ఉన్నారు.