25 March, 2026 | 1:45 PM

Breaking News

పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •  

భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం

25-03-2026 12:09 PM

హైదరాబాద్: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను(Sircilla Textile Industry) చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎల్ రమణతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను(Bhatti Vikramarka) కలిశాను. సిరిసిల్ల పవర్‌లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్‌చార్జిల భారంపై సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేసి, వాటిని మాఫీ చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో(BRS government rule) 25 హెచ్.పీ వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుందన్న కేటీఆర్ ప్రస్తుతం విద్యుత్ అధికారులు(Electricity Officials) విధిస్తున్న బ్యాక్ బిల్లింగ్(Back Billing) భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని వివరించారు. 2016 నుండి 2024 వరకు ఉన్న సుమారు 127 ఎస్.ఎస్.ఐ యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని తెలిపారు.

అది సర్‌చార్జిలతో కలిపి ఇప్పుడు రూ. 38 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటంతో పాటు, ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి తెలంగాణ నేతన్నలను అదుకోవాలని కేటీఆర్ ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.