25 March, 2026 | 2:35 PM

Breaking News

పుకార్లు నమొద్దు... గ్యాస్ బుకింగ్ రూల్స్ మార్చలే.. కేంద్రం క్లారిఫికేషన్   •   పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదు: భారత్ పెట్రోలియం ప్రకటన   •   కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •  

నేటి నుంచి మెథడిస్టు జాతర

17-05-2024 01:55 AM

జహీరాబాద్, మే 16 : జహీరాబాద్ పట్టణంలోని అల్లీపూర్ గ్రామ సమీపంలోని గార్డెన్‌నగర్‌లో శుక్రవారం నుంచి 94వ మెథడిస్టు జాతర ప్రారంభం కానున్నది. ఈ నెల 17వ తేది నుంచి 19వరకు జరిగే ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా రానున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అవసరమైన ఏర్పాట్లన్ని నిర్వాహకులు సిద్ధం చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 17వ తేదీ రాత్రి జెండాల ఊరేగింపు, 18న దైవధ్యాసం, ఆటల పోటీలు, దైవ సందేశాలు, ప్రత్యేక ప్రార్థనలు, బుర్రకథ ప్రదర్శన, భజన కీర్తనాలు, 19న ప్రముఖుల దైవ సందేశాలు, ప్రార్థనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.