సోమశిల ఆలయంలో అపశృతి
ధ్వజస్తంభం విరిగిపోవడంతో భక్తుల్లో ఆందోళన.
కొల్లాపూర్ రూరల్: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో శ్రీ వీర అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో(Sri Veera Abhaya Anjaneya Swamy Temple) జరుగుతున్న విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. మూడు రోజులుగా వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం ఆలయ ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించే కార్యక్రమం జరుగుతున్న సమయంలో గజస్థంభం మధ్యలో విరిగిపోయింది. దీంతో అక్కడ ఉన్న భక్తులు ఒక్కసారిగా అయోమయంలో పడిపోయారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ విరిగిపోయిన ధ్వజస్తంభాన్ని మళ్లీ ప్రతిష్టించరాదని ఆచార పరంగా భావిస్తారని తెలిపారు. త్వరలోనే కొత్త ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్ట కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహిస్తామని తెలిపారు.




