23 May, 2026 | 3:20 AM

విద్యుత్‌కు డిమాండ్!

23-05-2026 01:55 AM
  1. భగ్గుమంటున్న ఎండలు
  2. మొదటిసారిగా 271 గిగావాట్లకు చేరిక   

 హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయికి పెరిగింది. చాలాచోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం భారీగా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. ఈక్రమంలో మొదటిసారిగా ఈనెల 21న దేశ గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 270.82 గిగావాట్లకు చేరింది. గడిచిన ౪ రోజులుగా డిమాండ్ అధి కంగా ఉండటంతో అప్రమ త్తమైన అధికా రులు..

ఎప్పటికప్పుడు విద్యుత్ మంత్రిత్వశాఖ, విద్యుత్‌సంస్థలు, ఉత్పత్తి సంస్థలతో సంప్ర దిస్తునానరు. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తికి చర్యలు తీసుకుం టున్నారు. గడిచిన ౪ రోజులుగా దేశవ్యాప్తంగా విద్యుత్ విని యోగం గణనీయంగా పెరిగింది. ఈ నెల 21న 270.82 గిగావాట్లకు (2,70,820 మెగావాట్లు) చేరింది. ఇది ఈ వేసవిలో దేశంలోనే రికార్డు. అంతకుముందు రోజు (ఈనెల 20న)  265.44, 19న 260.45; 18న 257.37 గిగావాట్లు నమోదైంది.   

హైదరాబాద్‌లోనూ గరిష్ఠ స్థాయికి..

పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా జీహెచ్ ఎంసీ పరిధిలోనూ విద్యుత్‌వాడకం గణనీ యంగా పెరిగింది. ఈనెల 21న హైదరాబాద్ పరిధిలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 4,766 మెగావాట్లు నమోదైంది. అంతకుముందు 19వ తేదీన 4,748 మెగావాట్ల వినియోగం జరిగింది. ఏప్రిల్ 17న గరిష్ఠంగా 100.56 మిలియన్ యూనిట్ల వినియోగం జరగగా.. ఈరికార్డును ఈనెల 21న దాటేసింది.