28-10-2025 12:00:00 AM
 
							ఆదివాసి సంఘాల జేఏసీ చైర్మన్ పూనెం శ్రీనివాస్
ఏటూరునాగారం, అక్టోబరు27 (విజయక్రాంతి): ఆదివాసి సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం ఈరోజు ఏటూరునాగారం ఐటిడిఎ ప్రాంగణంలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ అధ్యక్ష తన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జేఏసీ చైర్మన్ పూనెం శ్రీనివాస్ మాట్లాడుతూ ఏటూరు నాగారం ఐటిడిఎ భవనం పాత బడి పోయింది అనే కారణంతో జంబోరి గ్రౌండ్ స్థలంలోకి మార్చే ప్రయ త్నాన్ని విరమించుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
క్రాస్ రోడ్డులో ఉన్న ఐటిడిఎతో ఆదివా సీలకి ఒక చారిత్రక గుర్తింపు ఉందని, ఆ గుర్తింపుని కనుమరుగు చెసే ఆలోచనను మానుకోవాలని హిత వు పలికారు. నూతన ఐటిడిఎ ప్రాంగణం నిర్మించడానికి ప్రస్తుతం ఉన్న ఐటిడిఎ స్థలంతో పాటు, ప్రక్కనే ఉన్న స్థలాన్ని కూడా ఉప యోగించు కోవచ్చు అన్నారు. నూత న ఐటిడిఎ ప్రాంగణంతో పాటు గిరిజన మ్యూజియం కూడా ఏర్పా టు చేయాలని, ఆదివాసి ప్రజల అభిప్రాయం మేరకు ప్రస్తుతం ఉన్న చోటే నూతన ఐటిడిఎ నిర్మాణం కూడా చేయాలని ప్రభుత్వానికి సూచించారు.