ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసిన దేమే కమ్మరి రాజు
10-08-2026 12:05 AM
తాడ్వాయి, ఆగష్టు, 09( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు దేమే కమ్మరి రాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేమే కమ్మరి రాజు మాట్లాడుతూ... కామారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు సీఎంకు వివరించినట్లు ఆయన తెలిపారు. కచ్చితంగా పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకువెళ్లడానికి కార్యకర్తలం ఐక్యంగా ఉన్నట్లు చంద్రబాబుకు వివరించినట్లు తెలిపారు.పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చంద్రబాబు నాయుడు తమకు సూచించినట్లు ఆయన వివరించారు.






