వరసిద్ధి వినాయక ఆలయ నూతన కమిటీ ఎన్నిక
చౌటుప్పల్, ఆగష్టు 9 : మండలంలోని కొయ్యలగూడెం గ్రామ శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి సర్పంచ్ కరీంకొండ స్వప్న అశోక్, ఉప సర్పంచ్ జెల్ల పవన్,రామాలయం చైర్మన్ మాచర్ల సంతోష్ కుమార్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు నూతన కమిటీని ఏర్పాటు చేశారు.
ఆలయ నూతన అధ్యక్షులుగా రవ్వ సంతోష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అదేవిధంగా నూతన డైరెక్టర్లుగా ఏలే మురళి, సూరకంటి మోహన్ రెడ్డి, కొయ్యడి స్వామి గౌడ్, అల్మాస్పేట గౌతమ్, రాసాల నర్సింహా, దికొండ ఉదయ్ కిరణ్ ను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు సర్వసభ్య సమావేశంలో పలువురు అభినందనలు తెలిపారు.ఆలయ ప్రతిష్ఠను మరింత పెంపొందిస్తూ భక్తుల సహకారంతో దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామ ప్రజలు, భక్తులు అందరూ సహకరించి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు కోరారు.






