కూల్చివేత చర్యలు చట్ట ప్రకారం ఉండాల్సిందే
- హైడ్రాకు హైకోర్టు ఉత్తర్వులు
- మర్రి, మారుతి, గాయత్రి విద్యాసంస్థల పిటిషన్లు పరిష్కారం
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): చెరువుల్లో ఆక్రమణలపై చర్యలు తీసుకుంటున్న హైడ్రాకు వ్యతిరేకంగా పలు నిర్మా ణదారులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. విద్యాసంస్థలతోపాటు బఫర్ జోన్ పరిధిలో ఇండ్ల నిర్మాణం చేసుకున్న వాళ్లు కూడా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల నోటిఫికేషన్లు జారీ చేసి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి వాళ్లు చూపించే ఆధారాలను పరిశీలించాకే చర్యలు తీసుకోవాలని బుధవారం హైడ్రా, జీహెచ్‌ఎంసీ ఇతరులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్ ప్రస్తుత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలంలోని సర్వే నంబర్ 48౦ నుంచి 48౩ వరకు మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన 10 ఎకరా లు, మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన 17.20 ఎకరాల్లో ఆక్రమణలున్నాయని పేర్కొంటూ గండిమైసమ్మ ఎమ్మార్వో ఈ నెల 22న ఇచ్చిన నోటీసులను ఆ విద్యా సంస్థలు హైకోర్టులో సవాల్ చేశాయి. వీటిని జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం విచారించి ప్రతివాదులకు పైవిధంగా ఆదేశాలు జారీ చేశారు.
సీనియర్ అడ్వొకేట్ ఎస్ నిరంజన్‌రెడ్డి వాదిస్తూ, చిన్నదామెర చెరువులో 8.25 ఎకరాలు అక్రమణలు జరిగాయంటూ తహసీ ల్దార్ ఇచ్చిన నోటీసుల అమలును నిలిపివేయాలని కోరారు. చట్టప్రకారం సర్వే నిర్వ హించి సరిహద్దులు నిర్ణయించేలా ఉత్తర్వు లు ఇవ్వాలన్నారు. కూల్చివేతలకు ఏకపక్షం గా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తహసీల్దార్ ఏకపక్షంగా సర్వే చేశారని ఆరోపిం చారు. మర్రి విద్యాసంస్థల్లో ఐదు వేల మం ది విద్యార్థులు ఉన్నారని, కూల్చివేత చర్యలు చేపట్టకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
2007లో విద్యా సంస్థల నిర్మాణాలకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఎగ్జిక్యూటి వ్ ఆఫీసర్ పర్మిషన్లు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి ప్రతివాదనలు చేస్తూ.. ఇదే వ్యవహారాలపై దాఖలైన పిల్‌లో చీఫ్ జస్టిస్ బెంచ్ అడ్వొకేట్ కమిషన్ ఏర్పా టు చేసిందన్నారు. చిన్నదామెర చెరువులోకి ఆక్రమణదారులు మురుగు నీటిని వదిలేస్తున్నారని కమిషన్ నివేదిక ఇచ్చిందని చెప్పారు.
ఆ నివేదిక పరిశీలించిన సీజే బెంచ్ ఆక్రమణలను తొలగించాలని ఆదేశించిందని గుర్తు చేశారు. చెరువు ఎఫ్టీఎల్‌ను ఆక్రమించి విద్యా సంస్థల నిర్మాణాలు ఉన్నాయని స్పష్టంచేశారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల ఆక్రమణలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని హైడ్రా తర ఫు న్యాయవాది కటిక రవీందర్‌రెడ్డి వాదించారు.
వాదనల తర్వాత సింగిల్ జడ్జి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా తహసీల్దార్ ఏడు రోజుల గడువుతో కూడిన నోటీసులు ఇచ్చారని, ఇప్పడు హైడ్రా కూల్చివేతల కోసం రంగంలోకి దిగిందని విద్యాసంస్థలు ఆందోళనలో ఉన్నాయని చెప్పింది. కూల్చివేతలకు తహసీల్దార్ ఇచ్చిన ఏడు రోజుల గడువు నోటీసులను రద్దు చేస్తున్నామని, ఆ నోటీసులను షోకాజ్ నోటీసులుగా పరిణించేలా మార్పు చేస్తున్నామని చెప్పింది. ఆపై పిటిషనర్ విద్యాసంస్థలు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత హైడ్రా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.






