గెస్ట్ లెక్చరర్లను కొనసాగిస్తూ ఉత్తర్వులు
- 2,280 మందిని విధుల్లోకి తీసుకుంటూ నిర్ణయం
- ప్రభుత్వ నిర్ణయంపై గెస్ట్ లెక్చరర్ల హర్షం
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ జూని యర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లు, పార్ట్ టైం హవర్లీ బేస్డ్ లెక్చరర్ల భర్తీకి అనుమతిస్త్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,280 మందిని యథాతథంగా కొనసాగించేలా నిర్ణ యం తీసుకుంది. వీరిలో 1,654 మం ది గెస్ట్ లెక్చరర్లు, 449 కాంట్రాక్ట్, 53 మంది పార్ట్‌టైం హవర్లీ, 43 పార్ట్‌టైం కన్సాలిడేట్, ముగ్గురు మినిమంటైం స్కేల్, 78 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు వీరిని కొనసాగిస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణ యంపై గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్, గెజిటెడ్ జూని యర్ లెక్చరర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వీ శ్రీనివాస్, కొప్పిశెట్లి సురే శ్ హర్షం వ్యక్తం చేశారు. పదకొండేళ్లుగా సేవలందిస్తున్న గెస్ట్ లెక్చరర్ల శ్రమను గుర్తించి ఉత్తర్వులు జారీ చేసేందుకు సహకరించిన సీఎంకు, ఉన్నతాధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.






