20 July, 2026 | 9:53 PM

నేడు ఎల్‌ఐజీ ఇళ్లకు శ్రీకారం

20-07-2026 02:21 AM
  1. క్యూర్ పరిధిలో ప్రారంభం
  2. మంత్రి పొంగులేటి 

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి) : రాష్ట్రంలో పేదవాడి సొంతింటి కల నెరవేరే వరకు ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం నిరంతరంగా కొనసాగుతుందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్లకు సోమవారం శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 11.30 గటలకు సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి ఇన్‌చార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు,

హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి ఎల్‌ఐజీ ఇళ్ల దరఖాస్తు విధానం, అర్హతలు, బ్రోచర్‌ను విడుదల చేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ  నేపథ్యంలో ఆదివారం ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లను సమీక్షించారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించిన ప్రభుత్వం.. ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు పట్టణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కల నిజం చేయబోతున్నామని చెప్పారు.