22-11-2025 08:32:11 AM
హైదరాబాద్: బంగాళాఖాతంలో శనివారం మరో అల్పపీడనం ఏర్పడింది. 24న వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నట్లు అధికారులు అలర్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా శనివారం జోగులాంబగద్వాల్, మహబూబ్‌నగర్, సూర్యాపేట జిల్లాలకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం కారణంగా నవంబర్ 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.