28 August, 2026 | 10:40 AM

లక్ష్మీగూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

18-12-2024 12:25 PM

అధికారులు బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం 

తమను బతకనివ్వరా అంటూ స్థానికుల ఆగ్రహం 

రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి డివిజన్ లక్ష్మీగూడలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.  లక్ష్మీగూడ, వాంబే కాలనీకి ఉదయం జేసీబీలు చేరుకున్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్ పైన వెలసిన ఆక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేస్తున్నారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పోలీసు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు, బాధితులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. తమను బతకనివ్వరా అంటూ తీవ్రస్థాయిలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని అధికారులు చెబుతున్నారు.