calender_icon.png 28 January, 2026 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ కట్టడం కూల్చివేత

28-01-2026 12:00:00 AM

కాచివానిసింగారంలో చర్యలు చేపట్టిన హైడ్రా

ఘట్ కేసర్, జనవరి 27(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా ఉప్పల్ జోన్ పరిధి కాచివానిసింగారంలో హైడ్రా మంగళవారం రోడ్డు ఆక్రమణపై చర్యలు చేపట్టింది. మలిపెద్ది హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి 40 ఫీట్ల రహదారిలోకి 13 అడుగుల మేర ఆక్రమించి పక్కనే ఉన్న తన పొలం హద్దులుగా పేర్కొంటూ ఒక కిలోమీటరు మేర ప్రహరీ నిర్మించారు. దివ్యానగర్ సింగరేనియన్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు నారపల్లి, దివ్యనగర్ కాచివాని సిం గారంలను కలుపుతూ సాగే ఈరోడుని ఆక్రమించారంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

దీంతో హైడ్రా క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో పరిశీలించి 13 అడుగుల మేర కు రోడ్డులోకి జరిగి ప్రహరీ నిర్మించారని తేల్చి కూల్చివేశారు.  హైడ్రా తీసుకుంటున్న చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కాచివానిసింగారంలో ప్రభుత్వ భూమి 6.12 ఎకరాలను ఆక్రమణదారుల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.