calender_icon.png 28 January, 2026 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వాయర్ వద్దంటూ ప్రజాభవన్‌లో ఫిర్యాదు

28-01-2026 12:00:00 AM

సానుకూలంగా స్పందించిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి 

ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం

రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తాం

గోపాలపేట జనవరి27: గొల్లపల్లి చీరుకపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు వద్దంటూ మం గళవారం హైదరాబాదులోని తెలంగాణ భ వన్లో అఖిలపక్ష నాయకులు ఫిర్యాదు చేశా రు. ప్రజా భవన్ లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లల చిన్నారెడ్డి కి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఏదుల రిజర్వాయర్లు పక్కనే ఉండగా రైతులకు నష్టం కలిగించే మరో రిజర్వాయర్ కూ త పెట్టు దూరంలో పెట్టడం నిరుపయోగం కావున గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనలు ఉపసంహరించు కోవాలని తెలి పారు.

పాలమూరు రంగారెడ్డి ఏదుల రిజర్వాయర్ లోని ఆప్ స్ట్రక్చర్ (ఓటి) తూము ద్వారా నీరు అందిస్తే డి5 డి8 కెనాల్ ద్వారా వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గం రైతులకు పుష్కలమైన సాగునీరు అందించవచ్చ అన్నారు. తక్కువ వ్యయంతో ఈ పనులు పూర్తి అవుతుందని చిన్నారెడ్డికి తెలిపారు. రై తులకు నష్టం కాకుండా ప్రభుత్వం గొల్లపల్లి చిర్కపల్లి రిజర్వాయర్ విరమించుకుని ఏదు ల రిజర్వాయర్ ద్వారా సాగునీరు ఈచ్చే వి ధంగా చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నా యకులు కోరారు.

అఖిలపక్ష నిర్ణయాన్ని రా ష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చి న్నారెడ్డి సానుకూలంగా స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు నష్టం జరగకుండా రిజర్వాయర్ విరివింప చేసి ఏ దుల రిజర్వాయర్ ద్వారా రైతులకు మేలు చే సే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు . అదేవిధంగా రాష్ట్ర సచివాలయంలోకి వెళ్లి ఇరి గేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రా హుల్ బొజ్జా ఐఏఎస్ ను కలిసి స్థానిక పరిస్థితులు గురించి వారికి అఖిలపక్ష నాయ కులు వివరించాఈ కార్యక్రమంలో మాజీ జె డ్పీటీసీలు రాజేశ్వర్ రెడ్డి, బోర్ల భీమయ్య, మాజీ ఎంపిటిసి రాజు రెడ్డి, మాజీ సర్పంచు లు భాస్కర్ రావు, రమేష్ యాదవ్, దొడ్ల రా ములు, బంకల సునీల్, మాజీ ఉపసర్పంచ్ శేషయ్య , అబ్దుల్ మహ్మద్,జుపల్లి కుమార్, భాస్కర్,దౌడ రాజు, వినోద్,సల్లేశ్వరం,తాలరి కురుమయ్య, మహేష్,జి.రాములు,శ్రీవర్ధన్ రెడ్డి, జిమ్మి రాములు,బొగ్గు వెంకటేష్, మ హేష్ రావు,బోయ రాములు,జెట్టి కురుమయ్య,విజయ్ మోహన్,గడ్డిగొపుల రాము డు తదితరులు పాల్గొన్నారు.