calender_icon.png 28 October, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేమ ఎక్కువగా ఉంది.. పత్తి కొనం

28-10-2025 12:17:55 AM

  1. ఆదిలాబాద్‌లో తొలిరోజే కొనుగోళ్లను నిలిపి వేసిన సీసీఐ 
  2.   12 శాతానికి మించి తేమ ఉందంటూ సాకు
  3. మార్కెట్ యార్డ్‌లోనే ఆందోళనకు దిగిన రైతులు
  4. వ్యాపారులతో కలెక్టర్, ఎమ్మెల్యే చర్చలు
  5. గూడుగోన పద్ధతిలో క్వింటాల్‌కు రూ.6,950 చొప్పున కొనేందుకు వ్యాపారుల అంగీకారం
  6. ఆ తర్వాత ప్రారంభమైన కొనుగోళ్లు

ఆదిలాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమైన తొలిరోజే ప్రతిష్టంభన నెలకొంది. ఆదిలాబాద్‌లో మార్కెట్ యార్డుకు రైతులు తెచ్చిన పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉందంటూ సీసీఐ అధికారులు కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఆందోళనకు దిగారు. అక్కడకు చేరుకున్న కలెక్టర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాపారులతో మాట్లాడి.. గుడుగోనా పద్ధతిలో క్విం టాలుకు రూ.6,950 చొప్పున కొనాలని చెప్పడంతో అంగీకరించారు.

రైతులు కూడా అంగీక రించడంతో తిరిగి కొనుగోళ్లు ప్రారంభమయ్యా యి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సోమవారం ఉదయం సీసీఐ ధర క్వింటాల్‌కు రూ. 8,110 మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రభుత్వం ఈ ఏడాది తొలిసారి కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ ప్రక్రియలో కొనుగోలు చేపడుతుండగా.. తొలిరోజున 500 వరకు పత్తి బండ్లు మార్కెట్‌కు వచ్చాయి.

ఒకటి, రెండు వాహనాలు మినహా.. మిగితా వాటికి తేమ శాతం అధికంగా చూపించడంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు కొను గోళ్లు నిలిపివేశారు. దీంతో రైతుల్లో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తమైంది. తూకం వేసే కాంటాల వద్ద నే ఆందోళన చేపట్టారు. తొలి పత్తి కావడంతో సహజంగానే కొంత మేర తేమ చూపిస్తుందని, ఇటీవల కురుస్తున్న వర్షాలతో సైతం పత్తిలో తేమ ఉంటుందని రైతులు చెప్పారు.

సీసీఐ కొనుగోలు చేయాలని పట్టుబట్టారు. కానీ అధికారులు ఇందు కు నిరాకరించడంతో రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోళ్లు నిలిచిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ మార్కెట్‌కు వచ్చి రైతులతో మాట్లాడారు. వారి సమస్యను తెలుసుకొని మార్కెట్ అధికారులతోనూ చర్చించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, వ్యాపారులు, సీసీఐ, మార్కెటింగ్ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసు కున్నారు. తేమ శాతం 12 వరకు వస్తే సీసీఐ కొనుగోలు చేయడం, అంతకుమించి తేమ శాతం ఉంటే ప్రైవేట్ వ్యాపారులకు రూ.6,950గా విక్రయించాల్సి ఉంటుందని నిర్ణయించారు. గూడ గోన పద్ధతి (తేమతో సంబంధం లేకుండా  ప్రస్తు తం వ్యాపారులు నిర్ణయించిన పూర్తి ధర) ప్రకారమే రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఈ ప్రతిపాదనకు రైతులు సైతం అంగీకరించారు.

దీంతో మధ్యాహ్నం 3 గంటల తర్వాత పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. జిల్లాలో వాతా వరణంలో ఏర్పడిన మార్పువల్లే పత్తిలో తేమ శాతం పెరిగిందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు జరిగేలా చూస్తా మని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇప్పటికే సీసీఐ సీఎండీ, చీఫ్ సెక్రటరీ, అధికారులతో మాట్లాడినట్టు తెలిపారు. తేమ శాతం సమస్యకు  పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.