10-12-2025 01:29:39 AM
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ముగింపు వేడుకల్లో భాగంగా మూడు వేల డ్రోన్ల ప్రదర్శనతో ప్రపంచ రికార్డును నమోదు చేసి, గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించింది. ‘తెలంగాణ ఈజ్ రైజింగ్.. కమ్.. జాయిన్ ది రైజ్ ’ అనే థీమ్‌తో భారీ డ్రోన్‌షో అట్టహాసంగా నిర్వహించారు. ఈ డ్రోన్ షోలో ప్రభుత్వ అమలు చేస్తున్న, అమలు చేయనున్న పథకాలు, అభివృద్ధి పనులను పొందుపర్చారు.
2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, అగ్రికల్చర్, సర్వీస్, మ్యాన్‌ప్యాక్చరింగ్ కల్చర్, అమరావతి, బెంగళూరు, చెన్నైకి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ జాతీయ కారిడార్లు, మెట్రో, మానాశ్రయాలు నిర్మాణం, మహిళలకు పెట్రోల్ బంకులు, సోలార్ పవర్, రైతు సంక్షేమం, యువత భవిష్యత్, ఇతర అంశాలను డ్రోన్‌షోలు ప్రదర్శించారు. ఇది అందరిని ఆకట్టుకుంది. ఫైర్ వర్క్స్ (బాణ సంచా ప్రదర్శన) సైతం ఆకట్టుకుంది