calender_icon.png 11 December, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి నిర్మూలనలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలి

10-12-2025 01:30:12 AM

కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపు 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) డిసెంబర్ 9 (విజయక్రాంతి): అవినీతి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా అవినీతి నిరోధక శాఖ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవినీతి నిర్మూలన వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబరు 3 నుండి 9వ  వరకు అవినీతి నిర్మూలన వారోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పొందే ప్రతి పౌరుడు అవినీతి విషయమై జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా అవినీతి ఘటనలు గమనించినప్పుడు వెంటనే అవినీతి నిరోధక శాఖకు తెలియచేయాలని సూచించారు.

పారదర్శక పరిపాలనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి  తాను చేయాల్సిన ప్రభుత్వ సేవలకు లంచం అడిగితే  ఎసిబి టోల్ ఫ్రీ  నంబర్ 1064కు కాల్ చేయాలని సూచించారు..ఈ కార్యక్రమంలో ఎసిబి డిఎస్పీ సాంబయ్య, సిఐ రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.