10 April, 2026 | 7:34 PM

Breaking News

రుద్రారం శివారులో అక్రమ ఇసుక టిప్పర్ సీజ్... ఒకరి అరెస్ట్   •   రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం   •   దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •  

విధులకు హాజరు కాని కార్యదర్శి… చర్యలు కోరుతున్న గ్రామస్తులు

10-04-2026 05:52 PM

చివ్వెంల,(విజయక్రాంతి): మండలంలోని పిల్లలజగ్గుతండ గ్రామ పంచాయతీలో కార్యదర్శి విధులకు హాజరు కాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి పెరుమళ్ళ అంజయ్య తన విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతో కార్యాలయంలో జరగాల్సిన పనులు నిలిచిపోయాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామస్తుల వివరాల ప్రకారం, కార్యదర్శి ప్రతి పది రోజులకు ఒకసారి మాత్రమే కార్యాలయానికి వచ్చి హాజరు పట్టికలో సంతకం చేసి వెళ్లిపోతున్నారని తెలిపారు. దీంతో పలు ప్రభుత్వ సేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఈ విషయంపై జిల్లా పంచాయతీ అధికారికి, ఎంపీడీఓకు గ్రామస్తులు ఫిర్యాదు చేసి, గ్రామంలో విచారణ జరిపి సంబంధిత అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.