10-12-2025 01:28:43 AM
వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు
మహబూబాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు గ్రామపంచాయతీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సామాగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు గ్రామాలు, వార్డుల వారిగా సిద్ధం చేసి బుధవారం గ్రామాలకు తరలించే విధంగా పంపిణీకి సిద్ధం చేశారు.
ఓటర్లకు ఎన్నికల్లో ఓటు వేయడానికి పోల్ చిట్టీల పంపిణీ ప్రారంభించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పీవో, పిఎస్, జోనల్ ఆఫీసర్, సిబ్బందిని నియమించి శిక్షణ కూడా ఇచ్చారు. గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, బారికేడ్లు, తాగునీటి వసతి, ఏర్పాట్లు పూర్తి చేశారు. బిఎల్‌ఓ ల ద్వారా గ్రామాల్లో ఓటర్లకు పోలిచిట్టిల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
మహబూబాబాద్ జిల్లాలో ఈనెల 11న గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, మహబూబాబాద్, నెల్లికుదురు మండలాల్లోని 155 గ్రామాల సర్పంచులు, 1,338 వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, 9 పంచాయతీ సర్పంచు పదవులకు, కొన్ని వార్డు సభ్యుల పదవులకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఏకగ్రీవం అయిన స్థానాలను మినహాయించి మిగిలిన సర్పంచు వార్డు సభ్యుల ఎన్నికలకు 4,110 పోలింగ్ కేంద్రాల్లో 11న ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వర కు పోలింగ్ నిర్వహించనున్నారు.
పోలింగ్ ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు నిర్వహించి విజేతలను ప్రకటించిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. సర్పంచి పదవులకు 468 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వార్డు సభ్యుల పదవులకు 2,421 మంది అభ్యర్థులు తుది పోటీలో ఉన్నారు.
కట్టుదిట్టమైన భద్రత
పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతియు తంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చే సినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఉదయం నుంచి పోలీసులు విధుల్లో ఉంటారని, 100 మీటర్ల వరకు ఎలాంటి ప్రచారం నిర్వహించకుండా, ప్రజలు ఇతరులు గుమ్మిగుడి ఉం డకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పా ట్లు చేస్తున్నామని చెప్పారు.
అవసరం లే కుండా తిరిగే వ్యక్తులను పర్యవేక్షిస్తూ అనుమానాస్పద చర్యలు కనబడితే వెంటనే స్పం దించే విధంగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సెన్సిటివ్ హైసెన్సిటివ్ పోలింగ్ కేం ద్రాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేస్తున్నామని, వీడియో రికార్డింగ్, స్ట్రైకింగ్ కోర్సు లు అందుబాటులో ఉంటాయన్నారు. పో లింగ్ కేంద్రాల్లోకి ప్రచార సామాగ్రి, మొబైల్ ఫోన్లు, పార్టీ చిహ్నాలు అనుమతించబడమని చెప్పారు.
మొదటి విడత జరిగే ఎన్నికల కోసం ఐదుగురు డిఎస్పీలు, 16 మంది ఇన్స్పెక్టర్లు, 60 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, వెయ్యి మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు. గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ కవాతు కూడా నిర్వహించారు. పౌరులు ప్రజాస్వామ్యహితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.