29 July, 2026 | 12:57 AM

భగవతినగర్‌లో డెంగ్యూ కేసు నమోదు

29-07-2026 12:00 AM

 అప్రమత్తమైన వైద్య సిబ్బంది

ఆదిలాబాద్, జూలై 28 (విజయక్రాంతి): ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి ఆసుపత్రి పరిధిలో ఒకరికి డెంగ్యూ జ్వరంగా నమోదవడంతో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది మంగళ వారం అప్రమత్తమయ్యారు. రాంనగర్ 12 వార్డులోని భగవతి నగర్ లో ఉంటున్న స్ఫూర్తి (17) మూడు రోజుల కిందట జ్వరంతో బాధపడుతూ నక్షత్ర ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు స్ఫూర్తికి డెంగీ సోకినట్లు నిర్ధారించారు.

ఈ విషయం తెలుసుకున్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది భగవతి నగర్ లోని ఇంటింటికి స్ప్రే చేయించారు. నీటి నిలువలను పారపోసి పైరిత్రిన్, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి 30 మందికి పరీక్షలు నిర్వహించి ఓఆర్‌ఎస్ ప్యాకెట్స్, మందు గోళీలు అందజేశారు.

ఈ శిబిరంలో అంకోలి డాక్టర్ బీ దీపిక, ఆరోగ్య పర్యవేక్షకులు ఆడే సురేష్, బొమ్మేత సుభాష్, ఆరోగ్య కార్యకర్తలు నల్ల ఈశ్వర్ రెడ్డి, డీ మమత, కే శ్రీవాణి, ఆశాకార్యకర్త పుష్పలత, మలేరియా టెక్నీషియన్ ఉదయ్ కిరణ్, పరుశరామ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.