29 July, 2026 | 1:18 AM

గంజాయి కట్టడిపై సిర్గాపూర్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు

29-07-2026 12:00 AM

సిర్గాపూర్, జులై 28: సిర్గాపూర్ మండల కేంద్రంలో గంజాయి విక్రయాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సిర్గాపూర్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఎస్త్స్ర మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో గ్రామంలోని వ్యాపార సంస్థలు, ముఖ్యంగా పాన్షాపులు, గుట్కా విక్రయ కేంద్రాలను డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధాన రహదారులతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.