29 July, 2026 | 1:19 AM

ఎల్లమ్మ బోనాలలో పద్మా దేవేందర్ రెడ్డికి ఘన సన్మానం

29-07-2026 12:00 AM

రామాయంపేట, జూలై 28: రామాయంపేట పట్టణంలోని ఏడిదల ఎల్లమ్మ అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించగా, ఉత్సవాలకు విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్లను రేణుక ఎల్లమ్మ యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు.

అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యూత్ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యాకర్, అస్నుద్దీన్, యూత్ ప్రెసిడెంట్ నవీన్, మధుకర్, బాసం శీను, రాచూరి శీను, రామ్కీ, శ్రీకాంత్ సాగర్, బబ్లు, శ్రావణ్, మహేష్, సార్గు స్వామి, వికాస్, పెంటాజీ తదితరులు పాల్గొన్నారు.