16 July, 2026 | 7:29 AM

అక్రమ వలసదారులను తరిమికొడతా

09-12-2024 01:59 AM
  1. నాటో నుంచి నిష్క్రమణ
  2. జనవరి 6 నిందితులను క్షమిస్తా
  3. అమెరికా అధ్యక్షుడు ట్రంప్

  4. న్యూయార్క్, డిసెంబర్ 8: ఎన్నికల తర్వాత నిర్వహించిన తొలి భేటీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ట్రంప్ తన వైఖరేంటో స్పష్టంగా తెలియజేశారు. ఈ డిబేట్‌లో దేశీయ, అంతర్జాతీయ ఒప్పందాల గురించి చర్చించారు. వలస చట్టాల కఠినతరం మొదలైన వాటి గురించి వివరించారు. జనవరి 6 క్యాపిటల్ భవనం వద్ద అల్లరి, జాతి ఐక్యత కోసం చేసిన ప్రమాణాల గురించి తెలియజెప్పారు. ‘ఆఫీసులో చేరిన మొదటి రోజే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ మీద తొలి యాక్షన్ తీసుకుంటా’ అని వివరించారు. 

గర్బనిరోధక మాత్రలు: గర్బనిరోధక మాత్రల లభ్యతను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోనని ప్రకటించారు. 

వలసదారులపై: అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న వలసదారులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తా. ‘డ్రీమర్’ వలసదారుల భవిష్యత్తును రక్షించేందుకు కృషి చేస్తా

జనవరి 6 అల్లర్లు: బాధ్యతలు స్వీకరించిన వెంటనే జనవరి 6 ముద్దాయిలను క్షమిస్తా.

ఫెడరల్ చైర్మన్: ఫెడరల్ చైర్మన్‌ను తొలగించే ప్రణాళికేది లేదని తెలిపారు. 

నాటోకు బాయ్.. బాయ్: నాటోలో నుంచి బయటకు వచ్చే అంశం గురించి తప్పకుండా చర్చిస్తానని చెప్పారు. 

ఇవి మాత్రమే కాకుండా ట్రంప్ ఇంకా అనేక అంశాల గురించి చర్చించారు. తను అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే నాటో నుంచి బయటకు రావడం, అక్రమవలసదారులకు చెక్ పెట్టడం వంటివి తక్షణమే పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు.