3 July, 2026 | 8:36 PM

Breaking News

అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •   గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం   •   రాజు గోండుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్ రాజర్షిషా   •  

రైతుల ఖాతాలలో రూ.271 కోట్లు జమ

30-05-2025 11:28 PM

జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్

మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లాలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా  25,280 మంది రైతుల మంచి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాలలో రూ. 271 కోట్లు జమ చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ తెలిపారు. జిల్లాలో 345 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 1,77,465 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతుల వద్ద నుండి పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకారం వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసిన 216 కొనుగోలు కేంద్రాలను మూసి వేయడం జరిగిందని తెలిపారు.