3 July, 2026 | 9:34 PM

Breaking News

నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •  

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

31-05-2025 12:00 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, మే 30 (విజయక్రాంతి):  జిల్లా లో నకిలీ విత్తనాలు, ఎరువులు, మందుల విక్రయాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలో ని బస్టాండ్ సమీపంలో ఉన్న అరుణ్ ఏజెన్సీ ఫర్టిలైజర్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలోని విత్తనాలు, పురుగుమందుల ప్యాకింగ్, లేబుళ్లు, అమ్మకాల రిజిస్టర్లు, నిల్వల వివరాలు కలెక్టర్ పరిశీలించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, నకిలీ విత్తనాల కారణంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొం టున్నారు. అలాంటి ఘటనలు పునరావృ తం కాకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిషేధించిన మందులు విక్రయిస్తే చర్యలు తప్ప వని, నిబంధనల్ని అతిక్రమించిన వారి మీద చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

అధికారులు రెగ్యులర్గా దుకాణాలపై తనిఖీలు నిర్వహించాలని సూచించారు. నకిలీ విత్తనాల సరఫరా, అమ్మకాలపై కఠినంగా చర్యలు తీసుకుని రైతుల ప్రయోజ నాలను కాపాడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ తనిఖీలో వ్యవసాయ అధికారి రాజశేఖర్, తహసీల్దార్ రాజు, అధికారులు, సిబ్బం ది, తదితరులు పాల్గొన్నారు.