ఘనంగా ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బర్త్ డే
సత్తుపల్లి, జూన్ 15 (విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రివర్యులు మల్లు బట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్బంగా సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో వారి పుట్టినరోజు వేడుక కార్యక్రమం, కేక్ కటింగ్ కాంగ్రెస్ శ్రేణులు తో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, సత్తుపల్లి ఏఎంసి చైర్మన్ దోమ ఆనంద్,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు,సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి కౌన్సిలర్స్,సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావుసత్తుపల్లి పట్టణ, మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు పాల్గొన్నారు.






